Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHగిరిజ‌నులు నాయ‌కులుగా ఎద‌గాలి

గిరిజ‌నులు నాయ‌కులుగా ఎద‌గాలి


పిలుపునిచ్చిన వెంక‌య్య నాయుడు

విజయవాడ : గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచు కోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారన్న వెంకయ్య నాయుడు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గ నిర్దేశం చేయాలన్నారు. తండాల్లో అక్షరాస్యత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు. గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

స‌మాజ‌పు ఆర్థికాభివృద్దిలో గిరిజ‌నులు కీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. నిత్యం శ్ర‌మించే వారిలో అడ‌వి బిడ్డ‌లు ముందుంటార‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ రంగాల‌లో రాణిస్తున్నార‌ని తెలిపారు.

గిరిజన సోదరులందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గిరిజన-ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే లక్ష్యంతో, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ కు, ఇతర నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

తాము జీవించటంతో పాటు ప్రకృతిని కాపాడు కోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్ టి వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోందన్నారు. వీటిని గిరిజన సోదరులు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments