‘మా’ సభ్యుల మధ్య ఐక్యత అవసరం
అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు ప్రకటన
హైదరాబాద్ – మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే తెలుగు సినీ పరిశ్రమ ఎదిగిందని పేర్కొన్నారు. ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడానికి కృషి చేశారని తెలిపారు.
సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించ వద్దని కోరారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. మౌనంగా ఉండటమే మంచిదన్నారు మంచు విష్ణు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి ఎందరో కృషి చేశారని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కొంచెం సంయమనం పాటించాలని సూచించారు. సున్నిత విషయాలు, అంశాలపై ఎవరూ స్పందించవద్దని కోరారు మంచు విష్ణు.
సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పక పోవడమే మంచిదన్నారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల..
సంబంధిత వ్యక్తులకు మేలు కంటే నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ కీలక సమయంలో మా సభ్యుల మధ్య ఐక్యత అవసరమని అన్నారు మా అధ్యక్షుడు.