విచారణలో తేలితే హేమపై చర్యలు
నటి హేమ వ్యవహారంపై కామెంట్స్
హైదరాబాద్ – బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. మొత్తం 103 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డ్రగ్స్ టెస్టులు చేపట్టారు. వీరిలో 86 మందికి పాజిటివ్ గా తేలినట్లు ప్రకటించారు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్.
ఇదిలా ఉండగా నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈనెల 27న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.
చట్ట విరుద్దమైన కార్యకలాపాలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నటి హేమకు సంబంధించి పోలీసులు సాక్ష్యాలు నిరూపిస్తే మా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంచు విష్ణు. హేమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, నిర్దారించు కోకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయడం మంచి పద్దతి కాదన్నారు . వదంతుల ఆధారంగా హేమ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు.