ముగిసిన మంచు విష్ణు విచారణ
రూ. లక్ష బాండు సమర్పణ
హైదరాబాద్ – వివాదాస్పద నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇద్దరు కొడుకులు మంచు మనోజ్, మంచు విష్ణులకు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు మోహన్ బాబు కు కూడా నోటీస్ జారీ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.
దీనిపై తీవ్రగా రియాక్ట్ అయ్యారు మోహన్ బాబు. ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను విచారణకు వెళ్లనీయకుండా అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది మోహన్ బాబుకు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి ఈనెల 24కు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది హైకోర్టు. ఇదిలా ఉండగా జారీ చేసిన నోటీసుకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రాచకొండ సీపీ సుధీర్ బాబును కలుసుకున్నారు.
అంతకు ముందు మనోజ్ కూడా సీపీని కలుసుకున్నారు. రూ. 1 లక్ష బాండు సమర్పించారు. ఇద్దరూ ఎవరికి వారే తమ వాదనలు వినిపించారు. విష్ణును గంటకు పైగా విచారించారు సీపీ. తండ్రి ఇంట్లో ఏ ఘటన చోటు చేసుకున్నా మీదే బాధ్యత అని స్పష్టం చేశారు అన్నదమ్ములకు.