విజయ సాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి
డిమాండ్ చేసిన శాంతి భర్త మదన్ మోహన్
అమరావతి – దేవాదాయ శాఖ ఏసీ కె. శాంతి మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్న తనకు ఎంపీ విజయ సాయి రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి. ఇదిలా ఉండగా సోమవారం ఎంపీ విజయ సాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనపై లేని పోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు రాధాకృష్ణ, బీఆర్ నాయుడుతో పాటు మహా న్యూస్ ఎండీ వంశీ ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎంపీ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు కె. శాంతి మాజీ భర్త మదన్ మోహన్. ముందు విజయ సాయి రెడ్డికి డీఎన్ఏ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. 2013లో శాంతిని తాను పెళ్లి చేసుకున్నానని, 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగం వచ్చిందని తెలిపారు. శాంతికి ఉద్యోగం వచ్చాక.. పీహెచ్డీ కోసం తాను యుఎస్ వెళ్లానని చెప్పారు మదన్ మోహన్.
శాంతి ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉండేదన్నారు. తీరు మార్చు కోవాలని చాలా సార్లు హెచ్చరించానని అన్నారు. ఎంపీ విజయ సాయిరెడ్డిని శాంతి తనకు పరిచయం చేసిందని చెప్పారు. ఎంపీకి భూమి విషయంలో సాయం చేశానని చెప్పిందన్నారు. రూ. 4 కోట్లతో విజయవాడలో విల్లా కొనాలని తనతో చెప్పిందన్నారు.
విల్లా కొనేందుకు విజయ సాయి రెడ్డి డబ్బులు ఇచ్చాడని ఆరోపించారు. నా పిల్లల మీద ప్రమాణం చెబుతున్నానని, తాను యుఎస్ వెళ్లాక శాంతి గర్భం దాల్చిందన్నారు. ఎలా అయ్యావంటే చెప్పుతో కొడతానని తనను తిట్టిందన్నారు మదన్ మోహన్. గడ్డిగా అడిగితే విజయ సాయి రెడ్డి పేరు చెప్పిందని అన్నారు. ఈ విషయం తెలిసాక ఏడ్చానని అన్నారు.
గత 3 నెలలుగా తనను శాంతి టార్చర్ చేస్తోందన్నారు. ఆమెతో తాను విడాకులు తీసుకోలేదన్నారు. శాంతి చెబుతున్నట్లు అంతా అబద్దమన్నారు. 2024 జూన్ 11న విడాకుల డాక్యుమెంట్ పై సంతకం చేశానని చెప్పారు మదన్ మోహన్. 2020 వరకు కలిసి ఉన్నానని, పిల్లల కోసం డబ్బులు పంపిస్తూనే ఉన్నానని అన్నారు. శాంతికి పుట్టిన మగ బిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడని అన్నారు. డీఎన్ఏ టెస్టుకు తాను సిద్దమని మరి ఎంపీ విజయ సాయి రెడ్డి సిద్దమేనా అని సవాల్ విసిరారు.