మోడీ నిర్వాకం అదానీకి అందలం
ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ మధు యాష్కి గౌడ్
అమరావతి – ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా మోడీ రాజ్యాంగ బద్ధమైన సంస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయన ప్రాణ మిత్రులకు మొత్తం దేశాన్ని కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదాని కి పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీ తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. అదానీ వ్యాపార అభివృద్ధికి మోడీ నే కారణమని ఫైర్ అయ్యారు మధు యాష్కి గౌడ్.
మోడీ అవినీతిపై ఎక్కడ మాట్లాడనివ్వరని, పార్లమెంట్ లో మైకులు కట్ చేస్తున్నారని వాపోయారు. అవినీతిపై ఇవ్వాళ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు పెట్టామని చెప్పారు.
ప్రభుత్వ సంస్థలను అదానీ సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. FDI లను లోబర్చుకున్నారని, ఎన్డీటీవీని గుంజుకున్నారని ఆరోపించారు. ముంబై ఎయిర్ పోర్ట్ ను జీవీకే సంస్థ నుంచి లాగేసుకున్నారని మండిపడ్డారు.
కృష్ణ పట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి పోయిందన్నారు. అల్ట్రా టెక్ సిమెంట్ మీద సీబీఐ కన్ను పడిందన్నారు. అంతే కాదు ఎస్బీఐ, ఎల్ఐసీపై కూడా దృష్టి సారించారని అన్నారు. ఎవరి ఆదేశాలతో అదానీ గ్రూపులలో పెట్టుబడులు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మధు యాష్కి గౌడ్.
దేశ భద్రతను అదానీకి కట్టబెట్టే పనిలో ఉన్నాడని ఆరోపించారు.