నటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు
తెలుగు వారి పట్ల షాకింగ్ కామెంట్స్
తమిళనాడు – ప్రముఖ వివాదాస్పద నటి కస్తూరి కనిపించడం లేదు. తెలుగు వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ మధ్య దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. తనను అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ కోసం మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. వాటిని ఖండిస్తూ చెన్నై, మదురై, తేని తదితర జిల్లాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
దర్యాప్తు చేసేందుకు సమన్లు ఇవ్వడానికి కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా తాళం వేసి ఉండడంతో పాటు ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన దావాపై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ముందు విచారణకు వచ్చింది. కస్తూరి మాటలను న్యాయమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. మళ్లీ విచారణకు రాగా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
రెండు ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశం ఉందని సమాచారం.