ఆనంద వికటన్ వెబ్ సైట్ పై బ్యాన్ ఎత్తివేయాలి
చెన్నై – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోడీకి సంకెళ్లు వేసిన ట్రంప్ ఉన్న కార్టూన్ కి చెందిన ఆనంద వికటన్ వెబ్ సైట్. దీనిపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిని సవాల్ చేస్తూ న్యూస్ పోర్టల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు గురువారం వెంటనే నిషేధాన్ని ఎత్తి వేయాలని ఆదేశించింది. అమెరికాలో ఉంటున్న విద్యార్థులకు సంకెళ్లు వేసినా ఎందుకు మోదీ మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ ఈ కార్టూన్ ను పబ్లిష్ చేసింది ఆనంద వికటన్. ఈ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన గొలుసులతో బంధించబడి కూర్చున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చిత్రీకరించే కార్టూన్ వికటన్ ఆన్‌లైన్ మ్యాగజైన్ వికటన్ ప్లస్‌లో ప్రచురితమైంది. ఈ కార్టూన్‌కు సంబంధించి తమిళనాడు బిజెపి నాయకుడు అన్నామలై పిటిషన్ దాఖలు చేశారు.
గత నెల 15న వికటన్ వెబ్‌సైట్ (www.vikatan.com) బ్లాక్ చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖకు ఇచ్చిన సిఫార్సు ప్రకారం, భారతదేశంలో వికటన్ మ్యాగజైన్ వెబ్‌సైట్ బ్లాక్ చేయబడిందని నివేదించబడింది.
ఈ కేసు విచారణ న్యాయమూర్తి భరత చక్రవర్తి సమక్షంలో జరిగింది. ఆనంద వికటన్ కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది విజయ నారాయణన్ హాజరై వాదించారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించే చర్య అని, భారత సార్వభౌమత్వానికి విరుద్ధమని వాదించారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఇంటర్నెట్ దిగ్బంధనను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదే సమయంలో, సంబంధిత కార్టూన్‌ను బ్లాక్ చేయాలని వికటన్ కంపెనీని కూడా ఆదేశించారు.