తండ్రీ కొడుకులు జంప్
తెలుగుదేశం పార్టీ గూటికి
అమరావతి – మాజీ ఎంపీ , ప్రముఖ వ్యాపారవేత్త మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్కై అప్రూవర్ గా మారి జైలు పాలై బయటకు వచ్చిన మాగుంట రాఘవ రెడ్డిలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు గత కొంత కాలం నుంచి ఏ పార్టీలోకి జంప్ కావాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. చివరకు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ప్రకాశం జిల్లా ప్రజల ఆశీస్సులతో ఈనెల 16న శనివారం సాయంత్రం మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలేనని, కేవలం నియోజకవర్గం అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు.
ఉండవల్లి లోని బాబు నివాసంలో తాము చేరబోతున్నట్లు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము వైసీపీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి.