వైసీపీకి షాక్ మాగుంట రాజీనామా
టీడీపీలోకి జంప్ అయిన ఎంపీ
అమరావతి – వైఎస్సార్ సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ప్రముఖ మద్యం వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్నారు. తాను అధికార వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు మాగుంట.
త్వరలోనే వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గుడ్ బై చెప్పడం విశేషం.
కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్, మచిలీ0పట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, కె రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా గత వారం పార్టీని వీడారు.
మూడు దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నా ప్రకాశం జిల్లా ప్రజలు తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజల ఆదరణకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీకి దింపాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారని అన్నారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాఘవరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో చెప్పలేదు.