మహా కుంభ మేళాకు పోటెత్తిన జనం
ఉత్తరప్రదేశ్ – యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా ఆధ్యాత్మిక మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ. 42 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని వెల్లడించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.
ఈ సంఖ్య యుఎస్ జనాభా 331 మిలియన్లు, కెనడా 38 మిలియన్ల జనాభాను మించి పోయిందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గత నెల జనవరి 13న ప్రారంభమైంది మహా కుంభ మేళా. ఈనెల 26వ తేదీ వరకు ఈ ఆధ్యాత్మిక మహోత్సవం కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ సెలిబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు , సీఈవోలు, చైర్మన్లు , మేనేజింగ్ డైరెక్టర్లు అలహాబాద్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన నటీ నటులు సంతోషం వ్యక్తం చేశారు. పుణ్య స్నానం చేయడం తమ జీవితంలో మరిచి పోలేమన్నారు. ఆ దేవుడు తమకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.