ప్రకటించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ఉత్తర ప్రదేశ్ – యూపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభ మేళాలో ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని వెల్లడించింది. దేశంలోని 110 కోట్ల మంది సనాతన అనుచరులలో సగానికి పైగా స్నానం చేయడం విశేషమని పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపింది. కొన్ని ఘటనలు మినహా కుంభ మేళా మహోత్సవం నిరాటంకంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్. సినీ, రాజకీయ, క్రీడా , వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం పుణ్య స్నానాలు చేశారని తెలిపారు.
గత జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభ మేళా ఆధ్యాత్మిక మహోత్సం ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా భక్తులు కుంభ మేళా కోసం వచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ 3 వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసింది. మొత్తంగా యూపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది.