9 కోట్లకు పైగా భక్తుల స్నానం
ఉత్తర ప్రదేశ్ – ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా భక్తులతో కిట కిట లాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం బారులు తీరారు. ఇప్పటి వరకు 9 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేసినట్లు ప్రకటించింది యూపీ బీజేపీ సర్కార్. ఈ సంఖ్య వచ్చే మరింత పెరగనుందని పేర్కొంది. కుంభ మేళా వచ్చే నెల ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేసింది.
ఇటీవల అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకోవడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది. భారీ ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా ప్రయాగ్ రాజ్ కు పోటెత్తారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పుణ్య స్నానాల కోసం ఏకంగా 3000 రైళ్లను ఏర్పాటు చేసింది.
దేశ వ్యాప్తంగా ప్రధాన రైళ్లను నడుపుతోంది. ఇంకో వైపు విమానాల రాక పోకలు కూడా పెరిగాయి. యూపీకి మహా కుంభ మేళా సందర్భంగా భారీగా ఆదాయం సమకూరుతోంది బీజేపీ ప్రభుత్వానికి. మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యోగి ఆదిత్యానాథ్.