ది డైరీ ఆఫ్ మణిపూర్ లో నటించనుంది
ఉత్తరప్రదేశ్ – ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోనాలిసా. ఊహించని రీతిలో ఆమెకు సినిమాలో ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో మూవీ చేయనున్నాడు. ఇందులో మోనాలిసా కీ రోల్ పోషించనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ మోనాలిసా ఇంటికి వెళ్లి సినిమాలో నటించేందుకు సంతకం చేయించుకున్నాడు.
మోనాలిసా స్వస్థలం మధ్య ప్రదేశ్. తను బతుకు దెరువు కోసం పూసలు అమ్ముకుంటోంది. మహా కుంభ మేళాలో తన పని తాను చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో తన అందం మీడియాను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ కన్ను మోనాలిసాపై పడింది. అత్యంత పేద కుటుంబానికి చెందిన మోనాలిసా ఉన్నట్టుండి కుంభ మేళా నుంచి వెళ్లి పోయింది. చివరకు బిగ్ ఛాన్స్ దక్కింది.
ఇదిలా ఉండగా మహా కుంభ మేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏకంగా 11 కోట్ల మందికి పైగా భక్తులు ఆయా ఘట్టాలలో పుణ్య స్నానాలు చేశారు. అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మరో వైపు 30 మందికి పైగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాయి.