DEVOTIONAL

శ్రీ‌శైలంలో కుంభాభిషేక మ‌హోత్స‌వం

Share it with your family & friends

ఈనెల 21తేదీ దాకా కొన‌సాగనున్న ఉత్స‌వం

శ్రీ‌శైలం – ప్ర‌సిద్ద శైవ పుణ్య క్షేత్రం శ్రీ‌శైల మ‌ల్ల‌న్న ఆల‌యం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి దీక్ష చేప‌ట్టిన వారితో పాటు సాధార‌ణ భ‌క్తులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. కొంద‌రు వాహ‌నాలలో, బ‌స్సుల‌లో వ‌స్తే వేలాది మంది కాలి న‌డ‌క‌న మ‌ల్లికార్జున స్వామిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే శ్రీ‌శైలం దేవ‌స్థానం పాలక మండ‌లి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌శైలం ఆల‌యంలో శుక్ర‌వారం మ‌హా కుంభాభిషేక మ‌హోత్స‌వం ప్రారంభ‌మైంది. భ‌క్తులు పెద్ద ఎత్తున హ‌ర హ‌ర మ‌హ‌దేవ , శంభో శంక‌రా అంటూ కీర్తించారు. స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ కుంభాభిషేక మహోత్స‌వం ఈనెల 21వ తేదీ వర‌కు కొన‌సాగుతుంద‌ని శ్రీ‌శైలం ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మంల‌డి చైర్మ‌న్, ఈవో వెల్ల‌డించారు. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు మహాకుంభాభిషేక సంకల్పం గోపూజ, గణపతి పూజ, దీక్ష ధారణ ,యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపనలు నిర్వ‌హించిన‌ట్లు ఈవో పెద్దిరాజు వెల్ల‌డించారు.

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లకు స్వర్ణ రథ సమర్పణ కార్యక్రమం కూడా చేప‌ట్టారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వర్ణ రథాన్ని శ్రీశైల దేవస్థానానికి విరాళంగా సమర్పించారు