Friday, April 4, 2025
HomeDEVOTIONALఒంటిమిట్ట‌లో మ‌హా శాంతి అభిషేకం

ఒంటిమిట్ట‌లో మ‌హా శాంతి అభిషేకం

అంగ‌రంగ వైభ‌వంగా మ‌హా సంప్రోక్ష‌ణ‌

తిరుప‌తి – టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ‌స్వామి వారి ఆల‌యంలో మహా శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉద‌యం 6 గంట‌ల‌కు చతుస్థానార్చ‌న‌ము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, స‌హ‌స్ర క‌ల‌శాది దేవత హోమం, స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, పూర్ణాహుతి నిర్వ‌హించారు. కళాపకర్షణ, శ‌య్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వ‌న్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం జ‌రిగింది.

ఆదివారం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త – ప‌వమాన హోమములు నిర్వ‌హించారు. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్ష‌ణ, మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. అనంత‌రం భ‌క్తుల‌ను స్వామి వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిచారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో న‌టేష్ బాబు, సూపరింటెండెంట్ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ న‌వీన్‌, ఇత‌ర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments