శ్రీ పద్మావతి అమ్మ వారి దర్శనం
తిరుపతి – మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, ప్రధాన పూజారులు సాదర స్వాగతం పలికారు.
అంతకు ముందు సీఎం తిరుపతి లోని తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకున్నారు. జేఈవో వీర బ్రహ్మం వెల్ కమ్ చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రం ఏర్పాటుకు నవీ ముంబైలో స్థలం కేటాయించాలని సీఎంకు చైర్మన్ నాయుడు విన్నవించారు.
మరాఠా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆలయం డిప్యూటీ ఈవో గోవింద రాజన్ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తీర్థ ప్రసాదాలను అందించారు. మహారాష్ట్ర సీఎం వెంట టిటిడి బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి, సౌరభ్ హెచ్.బోరా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం టూర్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.