మరాఠా పీఠంపై వీడని సస్పెన్స్
డిప్యూటీ సీఎం పై నో కామెంట్
మహారాష్ట్ర – మరాఠాలో ఎన్నికలు ముగిసి..ఫలితాలు వచ్చినా ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. ఎవరు సీఎం అవుతారనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రబుల్ షూటర్ , కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. కానీ సీఎం పోస్టు భర్తీపై ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం.
ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉంటారని, ఉప ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే తీసుకోవాలని ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే డిప్యూటీ సీఎం పదవి తనకు వద్దంటూ సున్నితంగా తిరస్కరించినట్టు టాక్.
షిండే అన్ని సమావేశాలను రద్దు చేసుకుని సతారా లోని తన పూర్వీకుల గ్రామానికి వెళ్లి పోవడం మరింత ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా ఫడ్నవీస్ సీఎం కావడం ఖాయంగా తోస్తోంది. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు షిండే. ఇదే సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా అజిత్ పవార్ ను నియమిస్తున్నట్లు తెలిసింది. ఇక ఉన్నది రెండే పోస్టులు కీలకమైనవి. ఒకటి హోం మంత్రిత్వ శాఖ మరోటి ఉప ముఖ్యమంత్రి పోస్టు.