NEWSNATIONAL

మ‌రాఠా స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

మ‌హిళ‌ల‌కు న‌గ‌దు బ‌దిలీ

మ‌హారాష్ట్ర – మ‌రాఠా ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం ఏక్ నాథ్ షిండే ఆదేశాల మేర‌కు మ‌హిళ‌ల‌కు వారి ఖాతాల‌లో ఇచ్చిన హామీ మేర‌కు రూ. 3,000 చొప్పున న‌గ‌దు బ‌దిలీ చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది.

ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేసిన ఖాతాల‌లో న‌గ‌దును జ‌మ చేసింది. ల‌క్ష్మీ బ‌హీ యోజ‌న పేరుతో సంక్షేమ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. దీనికి కేంద్ర స‌ర్కార్ కూడా త‌మ వంతుగా స‌హ‌కారం అందించింది.

ఈ ప‌థ‌కం కార‌ణంగా దాదాపు మ‌హారాష్ట్ర రాష్ట్రంలోని 2 కోట్ల మందికి పైగా మ‌హిళ‌ల‌కు ల‌బ్ది చేకూర‌నుంద‌ని ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు మ‌రాఠా ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండే. తాము ఇచ్చిన మాట ప్ర‌కారం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, మ‌హిళ‌లు స‌మాజంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు.

వారు అన్ని రంగాల‌లో త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. యువ‌త‌, మ‌హిళ‌ల సంక్షేమం కోసం త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఏక్ నాథ్ షిండే.

ఈ ప‌థ‌కం కింద ఎంపిక చేసిన మ‌హిళ‌ల‌కు రెండు విడ‌త‌లుగా న‌గ‌దు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమమే ప్రాధాన్య‌త‌గా ప‌ని చేస్తోంద‌ని పేర్కొన్నారు సీఎం.