ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీ – కేంద్ర సర్కార్ గత నెల ఫిబ్రవరికి సంబంధించి జీఎస్టీ వివరాలను ప్రకటించింది. అత్యధికంగా రూ. 30, 637 కోట్లతో మహారాష్ట్ర టాప్ లో నిలువగా అత్యల్పంగా మిజోరం కేవలం రూ. 42 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలిపింది. తెలంగాణ నుంచి రూ. 5,280 కోట్లు వసూలు కాగా, ఏపీ నుంచి రూ. 3,817 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక నుంచి రూ. 14,117 కోట్లు , గుజరాత్ నుంచి రూ. 11,402 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 10,694 కోట్లు , హర్యాణా రాష్ట్రం నుంచి రూ. 9,925 కోట్లు జీఎస్టీ వసూలు చేశాయని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రూ. 9,155 కోట్లు, ఢిల్లీ నుంచి రూ. 6,074 కోట్లు, పశ్చిమ బెంగాల్ నుంచి రూ. 5,797 కోట్లు, ఒడిశా నుంచి రూ. 5,344 కోట్లు, రాజస్థాన్ నుంచి రూ. 4,787 కోట్లు, మధ్య ప్రదేశ్ నుంచి రూ. 4,090 కోట్లు, ఛత్తీస్ గఢ్ నుంచి రూ. 3,351 కోట్లు, జార్ఖండ్ నుంచి రూ. 3,319 కోట్లు, కేరళ నుంచి రూ. 2,894 కోట్లు, పంజాబ్ నుంచి రూ. 2,125 కోట్లు వసూలైనట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ నుంచి రూ. 1,656 కోట్లు, బీహార్ నుంచి రూ. 1,644 కోట్లు, అస్సాం నుంచి రూ. 1,451 కోట్లు, గోవా నుంచి రూ. 601 కోట్లు, సిక్కిం నుంచి రూ. 332 కోట్లు, మేఘాలయ నుంచి రూ. 214 కోట్లు, త్రిపుర నుంచి రూ. 103 కోట్లు, అరుణా చల్ ప్రదేశ్ నుంచి రూ. 102 కోట్లు, నాగాలాండ్ నుంచి రూ. 56 కోట్లు, మణిపూర్ నుంచి రూ. 50 కోట్లు జీఎస్టీ వసూలైనట్లు వెల్లడించారు నిర్మలా.