సర్పంచ్ హత్య వివాదం కేసులో
మహారాష్ట్ర – సర్పంచ్ హత్య వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అందుకే తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంను కలిసి అందజేశారు. దీంతో ముండేను కేబినెట్ నుంచి తప్పించినట్లు ప్రకటించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆహ్వార , పౌర సరఫరాల శాఖను ధనుంజయ్ ముండే నిర్వహిస్తున్నారు. తన రాజీనామాతో ఈ శాఖను ఎవరికీ కేటాయించ లేదు సీఎం.
ఇదిలా ఉండగా ధనంజయ్ ముండే తన ప్రైవేట్ కార్యదర్శి ప్రశాంత్ భమ్రే, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రశాంత్ జోషి ద్వారా తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తన రాజీనామాను అందజేశారు. తదుపరి ప్రక్రియ కోసం రాజీనామాను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించినట్లు సీఎం పేర్కొన్నారు.
డిసెంబర్ 2024లో బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య వెనుక ప్రధాన సూత్రధారిగా ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ పేరు పెట్టబడినట్లు వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ముండే రాజీనామా జరిగింది.
ధనుంజయ్ ముండే బీడ్‌లోని పార్లి ఎమ్మెల్యే మాత్రమే కాదు, బీడ్ జిల్లా సంరక్షక మంత్రి కూడా. హత్యకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌షాట్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వైరల్ అయ్యాయి, సర్పంచ్ హత్య కేసులో నిందితులతో NCP నాయకుడికి ఉన్న సంబంధాల గురించి మరిన్ని విమర్శలు వచ్చాయి.