కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ
పరామర్శించిన మంత్రి సర్నాయక్
ముంబై – తీవ్ర అస్వస్థతకు గురై ముంబైలోని థానే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు పడింది. మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్, సచిన్ రమేష్ టెండూల్కర్, అజారుద్దీన్ తో సహా పలువురు క్రికెటర్లు ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాగా వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని స్పష్టం చేసింది ఆస్పత్రి యాజమాన్యం. కాంబ్లీని రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ పరామర్శించారు.
ఇటీవలే తమ చిన్ననాటి గురువు రమాకాంత్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కాంబ్లీతో పాటు సచిన్. తనను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్బంగా హిందీలో పేరు పొందిన పాత పాటను పాడాడు కాంబ్లీ.
సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఒకేసారి క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు కాంబ్లీ. కానీ ఆ తర్వాత వ్యక్తిగత బలహీనలతో తన కెరీర్ ను పాడు చేసుకున్నాడు. చివరకు బీసీసీఐ నెలనెలా ఇచ్చే పెన్షన్ తో నెట్టుకు వస్తున్నాడు. ఈ తరుణంలో గుండె పోటుకు గురయ్యాడు.