గవర్నర్ ను కలిసిన మహాయుతి నేతలు
ఫడ్నవీస్..షిండే..అజిత్ పవార్
మహారాష్ట్ర – ఓ వైపు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవానికి కాలం సమీపిస్తుండగా మరో వైపు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధానంగా సీఎం పదవి తనకు వద్దన్న షిండే ఆ తర్వాత బాంబు పేల్చారు. తనకు ఆ పదవే కావాలని, దానిని తప్పా ఇంకే పదవి వద్దంటూ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బుధవారం మహాయుతి నేతలు మూకుమ్మడిగా రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ కలుసుకున్నారు.
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, మహాకూటమి పార్టీల తరపున ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు తెలుపుతూ లేఖలను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, అశోక్ చవాన్, రావుసాహెబ్ దాన్వే పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.