వరద బాధితుల కోసం ప్రిన్స్ కోటి విరాళం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు
హైదరాబాద్ – తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీ, నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మానవతను చాటుకుంటున్నారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇందులో భాగంగా బాధితులకు చేదోడుగా ఉండేందుకు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు నటులు ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, జొన్నలగడ్డ సిద్దు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు తన వంతుగా సాయాన్ని ప్రకటించారు. మానవతను చాటుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి తన వంతుగా చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. 1 కోటిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ కు చెందిన నటి అనన్య నాగళ్ల సైతం విరాళాన్ని ప్రకటించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మహేష్ బాబు.