నువ్వు వచ్చాకే వెలుగు వచ్చింది
హైదరాబాద్ – ప్రిన్స్ మహేష్ బాబు తన భార్య , నటి నమ్రతా శిరోద్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్బంగా వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపారు. నువ్వు లేని జీవితం ఊహించ లేనని పేర్కొన్నాడు. నువ్వు వచ్చాక తన జీవితంలో గొప్ప వెలుగు వచ్చిందని పేర్కొన్నాడు ప్రిన్స్. తనతో పాటు పిల్లలు గౌతమ్, సితార సైతం అమ్మా నిన్ను మిస్ అవుతున్నాంటూ , నీ ప్రేమ గొప్పది అంటూ కితాబు ఇచ్చారు. ఇవాల్టితో తనకు 53 ఏళ్లు.
ఇద్దరూ కలిసి 2000లో వంశీ సినిమాలో నటించారు. దీనికి దర్శకత్వం వహించారు దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ కలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు మహేష్ బాబు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్నారు. ప్రత్యేకించి హీరోయిన్లు అందంగా ఉంటారు . కానీ ఎంత వయసు వచ్చినా ఇంకా యంగ్ అండ్ ఎనర్జిటిక్ తో ఉంటారు మహేష్ బాబు.
అందుకే నటుడు శోభన్ బాబు తర్వాత మోస్ట్ పాపులర్ నటుడుగా ఉన్నారు. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు కలిగి ఉన్న నటుడు తనే. ప్రస్తుతం తను దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి తీయబోయే సినిమాలో నటిస్తున్నాడు. దీనిని అంతర్జాతీయ కౌబాయ్ మూవీగా తెర కెక్కించనున్నట్లు సమాచారం. మొత్తంగా తాజాగా నమ్రత గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.