అనూహ్య స్పందన అపూర్వ ఆదరణ
నా గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
పశ్చిమ బెంగాల్ – టీఎంసీ సిట్టింగ్ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. శనివారం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా టీఎంసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. రోడ్ షోలో అడుగడుగునా మహూవా మోయిత్రాకు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోయిత్రా. బెంగాల్ లో ఏ పార్టీ ఆటలు సాగవన్నారు. టీఎంసీ చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
వారికి కావాల్సిందల్లా ఓట్లు తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంత మాత్రం కాదన్నారు మహూవా మోయిత్రా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లను రాబట్టు కోలేక పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇకనైనా మోదీ ఆయన పరివారం అబద్దాలు చెప్పడం మానేయాలని సూచించారు మహూవా మోయిత్రా.