సీఎం టూర్ లో భారీగా పెట్టుబడులు
కీలక కంపెనీలు హైదరాబాద్ పై ఫోకస్
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కొనసాగుతోంది. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కీలక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , సీఎస్ శాంతి కుమారి, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు.
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తన కంపెనీని విస్తరించనుంది. 15,000 జాబ్స్ ఇవ్వనుంది. వాల్ష్ కర్రా హొల్డింగ్స్ వి హబ్ లో 5 మిలియన్ డాలర్లతో పాటు తెలంగాణ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో భారీగా పెట్టుబడి పెట్టనుంది.
ఆర్సీసీఎం కంపెనీ 500 హై ఎండ్ టెక్ జాబ్స్ ను కల్పించనుంది. స్వచ్ఛ బయో కంపెనీ రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 500 మందికి జాబ్స్ ఇవ్వనుంది. ట్రిజన్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ఏఐ అండ్ డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. 1000 మందికి జాబ్స్ కల్పించనుంది.
హెచ్ సీ ఏ హెల్త్ కేర్ 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ ను విస్తరించనుంది. కార్నింగ్ కంపెనీ 2025లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. ప్రపంచ బ్యాంకు తెలంగాణ సర్కార్ తో ఒప్పందం చేసుకోనుంది. వివింట్ ఫార్మా రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1000 జాబ్స్ ఇవ్వనుంది. చార్లెస్ స్క్వాబ్ దేశంలోనే తొలి టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.