పర్యాటకపై బిగ్ ఎఫెక్ట్
మాల్దీవులు – భారత దేశంపై నిప్పులు చెరుగుతూ చైనాను అండ చూసుకుని రెచ్చి పోయిన మాల్దీవుల సర్కార్ కు కోలుకోలేని దెబ్బ తగలింది. అక్కడ తాజాగా జరిగిన ఎన్నికల్లో మోదీ అనుకూల సర్కార్ ఓటమి పాలైంది. ఇదే సమయంలో భారత్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్న ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో నిరంతరం విషం కక్కుతూ , నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు.
సీరియస్ గా తీసుకుంది భారత ప్రభుత్వం. ఆ మేరకు ప్రధాన మంత్రి స్వయంగా లక్ష ద్వీప్ కు వెళ్లారు. అక్కడ ఆయన సేద దీరుతూ ఫోటోలు షేర్ చేశారు. ఎంజాయ్ కోసం ఎందుకు మాల్దీవులు వెళ్లాలనే అర్థం వచ్చేలా ప్రజల్లోకి తీసుకు పోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. సోషల్ మీడియాలో మాల్దీవులు బాయ్ కాట్ పేరుతో ట్రోలింగ్ జరిగంది.
దీంతో అత్యధికంగా ఆదాయం ఆ దేశానికి పర్యాటక రంగం నుంచే వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 70 శాతానికి పైగా భారతీయులు వెకేషన్ కోసమని మాల్దీవు దేశాన్ని సందర్శించే వారు. కానీ సీన్ మారింది. భారతీయులంతా ప్రస్తుతం లక్ష ద్వీప్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో గట్టెక్కేందుకు 3 బిలియన్ డాలర్లను రుణంగా తీసుకుంది మాల్దీవు. చైనా వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
ఉన్నట్టుండి ఐఎంఎఫ్ సైతం వత్తిడి పెంచుతుండడంతో మాల్దీవుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.