మల్లారెడ్డికి కలెక్టర్ బిగ్ షాక్
అక్రమ అవుట్ లో రోడ్డు నిర్మాణం
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేతల లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ కబ్జాల వ్యవహారం మరోసారి వెలుగు లోకి వచ్చింది. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అక్రమంగా తన కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ మేరకు వెంటనే తొలగించాలని ఆదేశించారు.
ప్రస్తుతం ప్రభుత్వం మారడం, పవర్ లేక పోవడంతో మల్లారెడ్డి మౌనంగా ఉన్నారు. లేక పోతే ఈపాటికి కలెక్టర్ ను బదిలీ చేయడమో లేక ఆయనపై మాటలతో దాడి చేసి ఉండేవారు. ఇది పక్కన పెడితే గులాబీ నేతల ఆగడాలకు చెక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ భూ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపింది.
కాగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో 2,500 గజాలు ఆక్రమించారు మల్లారెడ్డి. ఆపై తన కాలేజీ కోసం రోడ్డు నిర్మించారు. ఇదే విషయంపై గతంలో సీఎం కాక ముందు రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
సీఎం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలకు దిగారు. హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లా రెడ్డి వేసిన రోడ్డును తొలగించారు.