డీకే శివకుమార్ తో మల్లారెడ్డి భేటీ
కుమారుడు భద్రారెడ్డి కూడా
బెంగళూరు – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయ పరంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. పార్టీ పవర్ లోకి రావడంతో ఉన్నట్టుండి స్వరం మార్చారు. మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేరికకు సంబంధించి తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఝలక్ ఇచ్చారు. మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అక్రమ కట్టడాలను కూల్చారు. దీంతో తట్టుకోలేక పోయారు మాజీ మంత్రి. హుటా హుటిన తనయుడు భద్రారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, రేవంత్ కు అత్యంత ఆప్తుడైన వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమయంలో తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలంటూ వేడుకున్నట్లు సమాచారం. గురువారం మల్లారెడ్డితో పాటు కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ కావడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.