రేవంత్ సీఎం అవుతాడని చెప్పా
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
హైదరాబాద్ – మొన్నటి దాకా పవర్ లో ఉన్న సమయంలో సవాళ్లు, ఆరోపణలు చేస్తూ వచ్చిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఉన్నట్టుండి స్వరం మార్చారు. ఊహించని రీతిలో తాను ఎవరినైతే టార్గెట్ చేశాడో ఆయనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. దీంతో ఊహించని రీతిలో కష్టాలు మొదలయ్యాయి.
తాజాగా సంచలన కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పానని అన్నారు. ఈ విషయం ఇప్పుడు కాదు పదేండ్ల కిందటే చెప్పానని, తన మాట నిజమైందని అన్నారు మాజీ మంత్రి.
రెడ్డిలలో రేవంత్ ఒక్కడికే ఆ అవకాశం దక్క బోతుందని అన్నానని, తన మాట తప్ప లేదన్నారు. అయితే తనకు రేవంత్ రెడ్డికి మధ్య వ్యక్తిగత భేదాలు లేవన్నారు. కానీ రాజకీయ పరంగా అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు చామకూర మల్లారెడ్డి.
తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని కోరిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.