బరిలో ఎవరున్నా గెలుపు మాదే
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
హైదరాబాద్ – మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి తమ అడ్డా అని, ఇక్కడ ఎవరు వచ్చినా భయపడే ప్రసక్తి లేదన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను నేతలు గెలిపించ లేదన్నారు. కేవలం కార్యకర్తలే విజయాన్ని కట్టబెట్టారంటూ చెప్పారు చామకూర మల్లారెడ్డి. ఇదిలా ఉండగా ఆయన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు.
ఆ రెండు పార్టీలకు అంత సీన్ లేదన్నారు. బీజేపీకి క్యాడర్ లేదని, ఇక ఈటల రాజేందర్ కు ఓటమి తప్పదన్నారు. ప్రస్తుతం తమ పార్టీ నుంచి జంప్ అయిన వాళ్లకు అక్కడ గుర్తింపు ఉండదన్నారు. ఆరు నూరైనా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.