NEWSNATIONAL

మోదీకి ఖ‌ర్గే బ‌హిరంగ లేఖ

Share it with your family & friends

మీరు చెప్పేవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

న్యూఢిల్లీ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి బ‌హిరంగ లేఖ రాశారు. మీరు చాలా నిరాశా నిస్పృహలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షం అన్న‌ది కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం రాచ‌రిక‌పు ఆలోచ‌న‌ల‌తో, నియంతృత్వ‌పు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్బంగా జ‌రిగిన ప్ర‌తి అంశంపై చ‌ర్చ‌లో ఈ విష‌యం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ వ‌చ్చామ‌ని , అయినా మీరు నిమ్మ‌కుండి పోయార‌ని ఆవేద‌న చెందారు. గంప గుత్త‌గా ఎలాగైనా స‌రే ఏమైనా స‌రే తాము గెలవాల‌ని అనుకోవ‌డం డెమోక్ర‌సీ అనిపించు కోద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షం అనేది బ‌లంగా ఉంటేనే అధికార ప‌క్షానికి స‌వాల్ గా ఉంటుంద‌ని తెలిపారు.

అధికారం కోసం భార‌త రాజ్యాంగాన్ని మార్చాల‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని పేర్కొన్నారు. అదే రాజ్యంగం క‌ల్పించ‌ని హ‌క్కులు, అవ‌కాశాల వ‌ల్ల‌నే ఇవాళ మీరు అతి పెద్ద ప్ర‌జాస్వామిక దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉండ‌గ‌లిగార‌ని తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు ఖ‌ర్గే. ఇక‌నైనా పీఎం అబ‌ద్దాలు మాని వాస్త‌వ లోకంలో రావాల‌ని కోరారు ఖ‌ర్గే.