NEWSNATIONAL

ఫేక్ వీడియోల త‌యారీ బీజేపీ ప‌నే

Share it with your family & friends

ధ్వ‌జ‌మెత్తిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే
క‌ర్ణాట‌క – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేక్ వీడియో చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు కేసు చేయ‌డం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా తీవ్రంగా స్పందించారు ఖ‌ర్గే.

ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో మోదీ వ‌చ్చాక బీజేపీ ఫేక్ వీడియోలు త‌యారు చేయ‌డం ఎక్కువై పోయింద‌న్నారు. త‌మ పార్టీకి అలాంటి చ‌రిత్ర ఎన్న‌డూ లేద‌న్నారు. తాము ప్ర‌జ‌ల‌ను ప్రేమిస్తామ‌ని, వారితో చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌బోమంటూ స్ప‌ష్టం చేశారు ఖ‌ర్గే.

ఒక ర‌కంగా చెప్పాలంటే అబ‌ద్దాల‌ను నిజాలుగా న‌మ్మించ‌డంలో, ప్ర‌చారం చేయ‌డంలో ,సోష‌ల్ మీడియాలో ఇత‌ర పార్టీల‌ను, నేత‌ల‌ను కించ ప‌రిచేలా మెస్సేజ్ లు పెట్ట‌డంలో బీజేపీని మించిన వారు ఎవ‌రూ లేర‌న్నారు ఏఐసీసీ చీఫ్‌.

ప్ర‌ధానంగా మోదీ ఈ దేశానికి చేసింది ఏమీ లేద‌న్నారు. ఇక‌నైనా ప్ర‌ధాన మంత్రి మారితే మంచిద‌ని సూచించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. అయినా ఈసారి ప్ర‌జ‌లు ఆయ‌న‌ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు .