బీజేపీపై భగ్గుమన్న ఖర్గే
శివరాజ్ సింగ్ పై ఫైర్
మధ్యప్రదేశ్ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. బుధవారం మధ్యప్రదేశ్ లో జరిగిన మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రచారం యావ తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న సోయి లేకుండా పోయిందన్నారు ఖర్గే.
జనం ఈసారి ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు పదే పదే తమను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర ఇస్తామన్న పీఎం మాట మారిస్తే ఎలా అని నిలదీశారు.
ఈసారి బీజేపీ కూటమికి కనీసం సీట్లు కూడా రావంటూ జోష్యం చెప్పారు మల్లికార్జున్ ఖర్గే. దేశంలో బీజేపీకి ప్రతికూలత ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ, తాను పార్టీని నాశనం చేస్తున్నామంటూ నిరాధార ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఒకవేళ ఎంపీలో శివ రాజ్ సింగ్ చౌహాన్ ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పగలవా మోదీ అంటూ నిప్పులు చెరిగారు ఖర్గే.