NEWSNATIONAL

మోదీ నియంతృత్వం చెల్ల‌దు

Share it with your family & friends

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. రాచ‌రిక పాల‌న సాగిస్తున్న‌ట్లు భావిస్తున్నార‌ని ఆరోపించారు. ఈసారి ఎన్నిక‌ల్లో మోదీ జిమ్మిక్కులు, మ్యాజిక్కులు ప‌ని చేయ‌వ‌ని అన్నారు. ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు.

అంత‌కు ముందు ఆయ‌న సామాజిక సంస్థ‌ల‌తో భేటీ అయ్యారు. వారు ఇచ్చిన సూచ‌న‌లు, స‌ల‌హాలు అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇది కేవలం కాంగ్రెస్‌ పోరాటం కాదని.. కాంగ్రెస్‌ కోసం పోరాడాల్సిన అవసరం లేదన్నారు.

.గత 139 ఏళ్లుగా కాంగ్రెస్‌ సజీవంగా ఉంద‌న్నారు… హత్యాయత్నాలు జరుగుతున్నాయి. అది చావదు… ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఒకట్రెండు సమావేశాలకు హాజరయ్యే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని… ప్రజాస్వామ్యాన్న ప‌దిలంగా భ‌ద్రంగా ఉంచు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడితేనే భావ వ్యక్తీకరణ చేయగలమ‌న్నారు…. లేకుంటే స్వాతంత్య్రానికి ముందు మీలాగే మూగ, చెవిటివారు అవుతారని హెచ్చ‌రించారు… ఈ పోరాటం మన కోసమేన‌న్న వాస్త‌వాన్ని గుర్తించాల‌ని అన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.