మోడీ మారితే మంచిది – ఖర్గే
ఇకనైనా మారక పోతే ప్రమాదం
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం విస్తు పోయేలా చేసింది. ప్రధానిగా కొలువు తీరాక తన తీరు మార్చు కోక పోవడం దారుణమన్నారు.
మోడీ సర్కార్ రాసిన రాష్ట్రపతి ప్రసంగం వింటూంటే అన్నీ అబద్దాలు తప్ప ఒక్కటి వాస్తవం కూడా లేదన్నారు. ఎన్నికల సందర్బంగా తను పదే పదే 400 సీట్లు వస్తాయని ప్రచారం చేశారని కానీ జనం మోడీని దారుణంగా తిరస్కరించారని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కేవలం 272 సీట్లకే పరిమితం చేశారంటూ ధ్వజమెత్తారు . అందుకే మోడీ ఏమీ మారనట్లు నటిస్తున్నారని, కానీ దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు మాత్రం ప్రధానమంత్రి తప్పకుండా మారాలని కోరుకుంటున్నారని చెప్పారు .
ఇకనైనా మోడీ మారాలని సూచించారు. లేక పోతే ప్రజలు ఛీ కొట్టే సమయం తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.