Tuesday, April 22, 2025
HomeNEWS56 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం

56 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం

డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి

హైద‌రాబాద్ – గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ 10 ఏళ్ల‌లో ఉద్యోగాల భ‌ర్తీపై దృష్టి పెట్ట‌లేద‌ని ఆరోపించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం ఏడాదిలోనే 56,000ల‌కు పైగా జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాము ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నామ‌ని, కానీ కేసీఆర్ నిరుద్యోగుల‌ను మోసం చేశాడ‌ని ఆరోపించారు.

గ‌త ప్ర‌భుత్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు డిప్యూటీ సీఎం. కానీ తాము వ‌చ్చాక ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే 7 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులు చేశార‌ని, వాటికి నెల నెలా వ‌డ్డీలు క‌ట్టలేక నానా తంటాలు ప‌డుతున్నామ‌ని వాపోయారు.

తాము ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వం విద్యార్థుల మెనూను ప‌ట్టించు కోలేద‌ని, కానీ తాము వ‌చ్చాక సీన్ మార్చేశామ‌న్నారు. 48 శాతం మెనూ ఛార్జీలు పెంచామ‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

RELATED ARTICLES

Most Popular

Recent Comments