సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని స్పష్టం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం కూడా రాబోయే ఉద్యోగ, విద్యా అవకాశాల పరంగా కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు.
మాల, మాదిగలు అంతటా ఒక్కటేనని ఈ తీర్పు ద్వారా ఎలాంటి నష్టం ఎవరికీ జరగదని తెలుసు కోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఇదిలా ఉండగా సమావేశానికి ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి తో పాటు నోడల్ అధికారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన వినతుల గురించి కూడా డిప్యూట సీఎం ఆరా తీశారు.