NEWSTELANGANA

సింగ‌రేణికి న్యాయం చేయండి

Share it with your family & friends

డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం

హైద‌రాబాద్ – తెలంగాణ‌కే త‌ల మానికంగా ఉన్న సింగ‌రేణికి న్యాయం చేయాల‌ని కోరారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఆయ‌న కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డికి విన‌తి ప‌త్రం ఇచ్చారు. సింగ‌రేణి బ‌త‌కాలంటే కొత్త గ‌నులు కేటాయించాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌న్నారు.

సింగ‌రేణి సంస్థ‌పై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది ఆధార‌ప‌డి బ‌తుకుతున్నార‌ని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డ‌గా ఇక్క‌డి ప్రాంత ప్ర‌జ‌ల‌ను , కార్మికుల‌ను దృష్టిలో పెట్టుకుని ఆదుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు కేంద్ర మంత్రికి.

135 సంవత్సరాల చరిత్ర కలిగి దేశం లోనే తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌.

గతంలో నిర్వహించిన వేలం పాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3 లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటి వరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించ లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరారు.
ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుంద‌న్నారు.