ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం – భట్టి
ఉప ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సీరియస్ కామెంట్స్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థ రహితమని పేర్కొన్నారు. రాజకీయంగా సోషల్ మీడియాలో బతుకుతున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై.
బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదన్నారు భట్టి విక్రమార్క. ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.. ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
బిఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగి పోయేదన్నారు. జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశామని ప్రకటించారు భట్టి విక్రమార్క.
నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ఆదుకుంటామని అన్నారు . సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
విపత్కర సమయంలో అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న విద్యుత్ సిబ్బందికి, సేవలు చేస్తున్న పోలీస్ శాఖ కు అభినందించారు భట్టి విక్రమార్క.