క్రీడాభివృద్దికి తెలంగాణ పెద్దపీట – భట్టి
ఉద్యోగుల క్రీడలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్ – తమ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి పెద్దపీట వేస్తోందని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రపంచంలో క్రీడా పోటీల్లో తెలంగాణ ప్రాతినిధ్యానికి, బంగారు పతకాలు సాధించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తప్పనిసరిగా ఒక పీరియడ్ క్రీడలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరకమైన బలోపేతానికి దోహదం కలుగుతుందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
క్రీడలు మన జీవితంలో తప్పనిసరి కావాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. విద్యా రంగానికి, ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో క్రీడలకు సంబంధించి పెద్ద పీట వేయడంతో పాటు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు మల్లు భట్టి విక్రమార్క.