కనకదుర్గ సన్నిధిలో భట్టి..శ్రీధర్ బాబు
తెలుగు ప్రజలంతా సుఖంగా ఉండాలి
విజయవాడ – బెజవాడ లోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరు పొందిన కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఐఏసీసీ మెంబర్ గిడుగు రుద్రరాజు. వీరికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. పూజారులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మ వారితో కూడిన చిత్ర పటాలను భట్టి, బాబు, గిడుగులకు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు చల్లగా ఉండాలని, తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లేలా చూడాలని అమ్మ వారిని ప్రార్థించడం జరిగిందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఎన్నో ఆశలు , ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మ వారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.