ఆర్టీసీని కాపాడు కోవడం మన బాధ్యత
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శనివారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సంస్థ ప్రజలదని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఇవాళ 100 కొత్త బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహాలక్ష్మి ప్రభుత్వ పథకం అద్భుతంగా పని చేస్తోందన్నారు. తాము కొలువు తీరాక 15 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని, ఇది ఓ రికార్డు అన్నారు. చాలా మంది బాలికలు, యువతులు, మహిళలు ఉచిత ప్రయాణం ఉపయోగించు కుంటున్నారని ఇది ఆత్మ గౌరవాన్ని సూచిస్తోందన్నారు.
ప్రభుత్వ పరంగా ప్రతి పైసాను తాము చెల్లించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం అన్ని బస్సులు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసి లాభాల బాట పడుతుందన్నారు. ఇక నుంచి ప్రతిపక్షాలు ఆధారాలు లేకుండా మాట్లాడటం మాను కోవాలని సూచించారు.