ఎంపీ కోసం పదవి వదులుకుంటా
ప్రకటించిన మాజీ ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ – మాజీ ఎంపీ , ఢిల్లీలో కాంగ్రెస్ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా పదవీ ప్రమాణం చేశారు ఢిల్లీలో. అంత లోనే మనసు మార్చుకున్నారు. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉందన్నారు. ఇప్పటికే ఎంపీగా పని చేశారు. కానీ ఓడి పోయారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
పలువురు పోటీ చేసేందుకు అప్లై చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో తాను నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను అవసరమైతే అధికార పార్టీ ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు మల్లు రవి.
ఇదిలా ఉండగా పార్టీలో మల్లు రవి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా . ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు. మల్లు అనంతరాములు కొడుకు. సోదరుడు భట్టి విక్రమార్క.