సమస్యల పరిష్కారంపై ఫోకస్
స్పష్టం చేసిన మాజీ ఎంపీ రవి
నాగర్ కర్నూల్ జిల్లా – ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మాజీ ఎంపీ , ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మల్లు రవి. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేసే పనిలో పడ్డామన్నారు.
గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం తాము పవర్ లోకి వచ్చాక ఖాళీ ఖజానా చేతికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అడుగంటి పోయిందన్నారు.
తాము వచ్చిన వెంటనే ప్రగతి భవన్ లోకి ప్రజలను అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు డాక్టర్ మల్లు రవి.
త్వరలో రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లను అన్నింటిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు.