NEWSTELANGANA

మ‌ల్లు ర‌వి నామినేష‌న్

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థిగా దాఖ‌లు

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు , మాజీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి మంగ‌ళ‌వారం నాగ‌ర్ క‌ర్నూల్ లోక స‌భ స్థానం నుంచి హ‌స్తం అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్న రెడ్డి , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నామినేష‌న్ సంద‌ర్బంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు. ప్ర‌స్తుతం ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ , బీజేపీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎంపీ రాములు త‌న‌యుడు భ‌ర‌త్ కుమార్ బ‌రిలో ఉన్నారు.

ప్ర‌స్తుతం పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. బీఎస్పీ చీఫ్ గా ఉన్న ఆర్ఎస్పీ ఇదే లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే ఆలంపూర్ కు చెందిన వారు. ఆయ‌న ఎస్పీగా, గురుకులాల సెక్ర‌ట‌రీగా పేరు పొందారు . బీఎస్పీలో చేరారు ఆ త‌ర్వాత బీఆర్ఎస్పీలోకి జంప్ అయ్యారు.

ముగ్గురు మాల సామాజిక వ‌ర్గానికి చెందిన వారి మ‌ధ్య పోటీ మ‌రింత తీవ్రం కానుంది. మ‌ల్లు ర‌వి మాత్రం తాను గెల‌వ‌డం ప‌క్కా అంటున్నారు.