NEWSNATIONAL

నీతి ఆయోగ్ ను ర‌ద్దు చేయాలి – సీఎం

Share it with your family & friends

స‌మావేశం నుంచి వాకౌట్ చేసిన మ‌మ‌త

ఢిల్లీ – ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిప్పులు చెరిగారు. మోడీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశం నుంచి అర్ధాంత‌రంగా వెళ్లి పోయారు. తాను బాయ్ కాట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అనంత‌రం మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీసుకు వ‌చ్చిన నీతి ఆయోగ్ బ‌క్వాస్ అని కొట్టి పారేశారు. వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. నిధులు త‌మ రాష్ట్రానికి ఎందుకు మంజూరు చేయ‌లేదని తాను నిల‌దీశాన‌ని, ఇది త‌న హ‌క్కు అని చెప్పారు. కానీ అక్క‌డ ఉన్న వారు మైక్ క‌ట్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేంద్రం తీసుకు వ‌చ్చిన వార్షిక బ‌డ్జెట్ పూర్తిగా వివ‌క్ష‌తతో కూడుకుని ఉన్న‌ద‌ని ఆరోపించారు మ‌మ‌తా బెన‌ర్జీ. భ‌విష్య‌త్తులో తాను ఏ నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌రు కాబోనంటూ తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు మోడీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందే త‌ప్పా రాష్ట్రాల‌కు సంబంధించి మేలు చేకూర్చేందుకు ఎంత మాత్రం కాద‌ని ధ్వ‌జ‌మెత్తారు సీఎం.