రూ. 931 కోట్లతో నెంబర్ వన్ సీఎంగా చంద్రబాబు
హైదరాబాద్ – దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఏడీఆర్ సీఎంల ఆస్తులను ప్రకటించింది. రూ. 931 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా టాప్ లో నిలిచారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ. 1,630 కోట్లు. భారత దేశ తలసరి నికర జాతీయ ఆదాయం రూ. 1,85,854 . అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పెమా ఖండూ రూ. 332 కోట్లకు పైగా ఆస్తులతో రెండవ ధనిక ముఖ్యమంత్రిగా నిలవగా కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య రూ. 51 కోట్లకు పైగా ఆస్తులతో జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో జాబితాలో రెండో స్థానంలో ఉండగా, రూ.1.18 కోట్లతో పినరయి విజయన్ మూడో స్థానంలో ఉన్నారు.
ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. సిద్ధరామయ్యకు రూ.23 కోట్లు, నాయుడుకు రూ.10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది.
13 (42 శాతం) మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ప్రకటించారు. 31 మంది ముఖ్యమంత్రులలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన అతిషి.