NEWSNATIONAL

దూర‌ద‌ర్శ‌న్ లోగో మార్పుపై ఫైర్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ
ప‌శ్చిమ బెంగాల్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిప్పులు చెరిగారు. మోదీ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ప్ర‌భుత్వానికి చెందిన దూరద‌ర్శ‌న్ ఛాన‌ల్ కు సంబంధించి కాషాయ రంగులో లోగోను మార్చ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

దేశ వ్యాప్తంగా జాతీయ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దూరదర్శన్ లోగో అకస్మాత్తుగా కాషాయీకరణ రంగు మారడం చూసి తాను షాక్ అయ్యాన‌ని అన్నార మ‌మ‌తా బెన‌ర్జీ. ఇది పూర్తిగా అనైతికమ‌ని, అంత‌కు మించి చట్ట విరుద్ధమ‌ని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అన్ని వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇస్తూ స‌మాచారాన్ని ఇవ్వాల్సిన దూర‌ద‌ర్శ‌న్ ఇవాళ మోదీకి మోక‌రిల్లితే ఎలా అని ప్ర‌శ్నించారు సీఎం.

ప్రజలు ఎన్నికల ధ్యాస‌లో ఉన్నప్పుడు భారత ఎన్నికల సంఘం ఈ పచ్చి, కుంకుమ అనుకూల నమూనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను ఎలా అనుమతించింద‌ని నిప్పులు చెరిగారు. ఈసీ నిద్ర పోతోందా అని మండిప‌డ్డారు. వెంట‌నే దానిని నిలిపి వేయాల‌ని దీదీ డిమాండ్ చేశారు. నీలం రంగు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.